ఫిట్ మామ్.. మంచు లక్ష్మీ వర్కౌట్లు వైరల్ వీడియో !!

Manchu Lakshmi Workouts

మంచు లక్ష్మీ తన కూతురు నిర్వాణతో యోగా చేస్తుందన్న సంగతి తెలిసిందే. మోడ్రన్ మామ్‌గా మంచు లక్ష్మీ తన కూతురు నిర్వాణతో అంతే సరదాగా ఉంటుంది. ఇద్దరూ కలిసి వేసే యోగాసానాలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక ఆ మధ్య లాక్ డౌన్‌లో ఈ తల్లీకూతుళ్లు చేసిన రచ్చ అందరికీత తెలిసిందే. బాల్కనీలో మంచం వేసుకుని చందమామ కథలు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఇక తాజాగా మంచు లక్ష్మీ.. వర్కౌట్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Manchu Lakshmi Workouts
Manchu Lakshmi Workouts

తన ఇంటి బాల్కనీలోనే మంచు లక్ష్మీ ఓ రేంజ్‌లో వర్కౌట్లు చేస్తోంది. కోచ్ నేతృత్వంలో మంచు లక్ష్మీ కండలు పెంచేస్తోంది. బాహుబలి రేంజ్‌లో అవ్వాలని ట్రై చేస్తోందో ఏమోగానీ ఓ రేంజ్‌లో కసరత్తులు చేసేస్తోంది. ఈ మేరకు వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇంట్లో వర్కౌట్లు చేసినా లేదా పాపతో సరదాగా గడిపినా.. అది మనకోసం మనమే ఎంతో గొప్ప పని చేసినట్టు. ఎందుకంటే.. దాని వల్ల మీరు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతోంది.

అలా మీరు చేసినట్టైతే.. మీకు చప్పట్లు కొట్టాల్సిందే. మంగళవారం మార్పు.. ఎప్పటికీ ఫిట్‌గా ఉండాలి.. ఫిట్‌నెస్సే ముందు.. ఫిట్‌గా ఉండండి.. ఫిట్‌గా తయారవ్వండి.. నిర్వాణ మంచుతో కలిసి ఈ వర్కౌట్లను చేస్తోన్నాను.. నేను ఎప్పుడూ ఫిట్ మామ్ అంటూ మంచు లక్ష్మీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.