మంచు లక్ష్మీ వ్యవహారమే కాస్త విభిన్నంగా ఉంటుంది. మంచు వారితో ఎవరైనా పని చేస్తే చాలు వారు మంచు లక్ష్మీకి క్లోజ్ అవుతారు. వారి బ్యానర్‌లో సినిమాలు చేసినా, మంచు హీరోలతో నటించిన హీరోయిన్లందరూ మంచు లక్ష్మీకి నిత్యం టచ్‌లోనే ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా తాప్సీ, రకుల్ వంటి వారు మంచు లక్ష్మీకి చాలా క్లోజ్. దాదాపు హీరోయిన్లందరూ మంచు లక్ష్మీకి స్నేహితురాళ్లుగా మారిపోతుంటారు.
అయితే అందరిలోనూ మంచు లక్ష్మీ, రకుల్ మధ్య బంధం చాలా గట్టిపడింది. ఇద్దరూ కలిసి వ్యాయామాలు చేస్తారు.. కలిసి షికార్లు చేస్తారు. వీరి రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కోసారి వీరి బంధాన్ని చూస్తే నెటిజన్లకు ఎక్కడా లేని అనుమానాలు వస్తాయి. తాజాగా మంచు లక్ష్మీ ఓ వీడియోను షేర్ చేసింది. దాంట్లో వారిద్దరి అంత సన్నిహితంగా చూడటంతో వారి బంధానికి వెరైటీ పేర్లు కూడా పెడుతున్నారు.
రకుల్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ మంచు లక్ష్మీ ఓ వీడియోను షేర్ చేసింది. ఎంతో సిన్సియర్, కష్టపడేతత్త్వం, అంకితభావం, సరదా, కేరింగ్, పిచ్చి ఇలా అన్నీ ఉన్నా స్నేహితురాలి ప్రపంచలోని గొప్పవన్నీ పొందే అర్హత కలది. హ్యాపీ బర్త్ మై లవ్. నువ్ తోడుండే జీవితంలో సంతోషం ఉంటుంది. నువ్ నన్ను గొప్ప మనిషిలా తయారు చేశావ్.. అని మంచు లక్ష్మీ రకుల్‌పై ప్రేమను కురిపించింది. ఇక ఈ ప్రేమను చూసిన రకుల్ స్పందిస్తూ.. లవ్యూ.. నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్.. సోదరిలా ప్రేమ పంచినందుకు థ్యాంక్స్.. అంటూ తమ మధ్య ఉన్నది కేవలం సోదరిమణుల సంబంధమే అని క్లారిటీ ఇచ్చింది.