పవన్ పై ట్రోల్స్ ని తిప్పి కొట్టిన మంచు లక్ష్మి.!

Lakshmi-Manchu-Age-Family-Husband-Movies-Biography

టాలీవుడ్ అగ్ర హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు సినిమాలు సహా అలాగే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి పొలిటికల్ పరంగా అయితే పవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు సహా ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.

మరి అలాగే రీసెంట్ గా పవన్ తన సోషల్ మీడియా నుంచి మార్షల్ ఆర్ట్స్ పోజ్ ఒకటి రిలీజ్ చేయగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ దీనిని కూడా కొందరు పొలిటికల్ పరంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు.

అయితే వాటిలో ఈ స్టిల్ ని మంచు వారి వారసురాలు మంచు లక్ష్మి స్టిల్ తో పెట్టి పవన్ కాపీ కొట్టాడని సినిమాలే కాదు స్టిల్స్ కూడా రీమేక్ చేస్తున్నాడని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దీనిపై అయితే లేటెస్ట్ గా మంచు లక్ష్మి స్పందించింది.

మరి దీనిపై అయితే స్పందిస్తూ ఇది మంచో చెడో కానీ పవన్ కళ్యాణ్ గారి పక్కన నా ఫోటో కనిపించడం అనేది ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నానని ఆ ట్రోల్స్ చేసిన వారికి గట్టి రిప్లై తో తిప్పికొట్టింది. దీనితో ఇప్పుడు మంచు లక్ష్మి రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.