మంచు లక్ష్మీ తన కూతురు నిర్వాణ చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది. తాతా మోహన్ బాబు దగ్గరకు వెళ్తే ఆ అల్లరి పీక్స్‌కు చేరుతుంది. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు అంటూ తాత గురించి ముద్దు ముద్దుగా చెబుతుంది. మంచు లక్ష్మీ తన కూతురితో పాటు యోగాసానాలు వైరల్ అవుతుంటాయి. ఇప్పటి నుంచే కూతురికి యోగాను నేర్పించేస్తోంది.
ఇక మంచు ఫ్యామిలీకి దైవభక్తి ఎక్కువేనన్న సంగతి తెలిసిందే. పూజలు పునస్కారాలు పట్టింపులు పద్దతులు అన్నీ కూడా ఎక్కువే. ప్రతీ పండుగను అందరూ కలిసి మోహన్ బాబు ఇంట్లోనే నిర్వహిస్తుంటారు. ఇక ప్రతీ ఆదివారం కచ్చితంగా మంచు లక్ష్మీ తన కూతురును తీసుకుని మోహన్ బాబు వద్దకు వెళ్లాల్సిందేనట. తప్పని సరిగా ఆ రోజు అక్కడ అటెండెన్స్ వేయించుకోవాల్సిందేనట.
ఈ క్రమంలో ఈ ఆదివారం కూడా అక్కడకు వెళ్లారట. అయితే ఆదివారం ఎంజయ్ చేశాక సోమవారం ఉదయాన్నే లేవాలంటే ఎవరికైనా కాస్త చిరాకు అనిపించొచ్చు. అలా తమ ఇంట్లో సోమవారం మాత్రం ఇలా ప్రారంభం అవుతుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. రాధే రాధే అంటూ కృష్ణుని పాట మోగుతుండగా.. నిర్వాణ పొద్దుపొద్దున్నే బెడ్రూం రూంలోనే స్టెప్పులు వేసేస్తోంది. మై రాధే.. మేము ఇలాగే నిద్ర లేస్తాం.. అంటూ మంచు లక్ష్మీ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.