ఈ ఏడాదిలో నెగెటివ్ పర్సన్ నేనే.. మంచు లక్ష్మీ

Manchu Lakshmi Comments On Rakul Preet Corona Post

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక తన ఫ్రెండ్స్‌పై మంచు లక్ష్మీ వేసే పంచ్‌లు వేరే లెవెల్‌లో ఉంటాయి. రకుల్ ప్రీత్, తాప్సీ పోస్ట్‌లకు మంచు లక్ష్మీ నిత్యం స్పందిస్తూ ఉంటుంది. ఇక హీరోల్లో అయితే రానా, మంచు మనోజ్ వంటి వారికి కౌంటర్లు వేస్తుంటుంది. తాజాగా రకుల్ కరోనా బారిన పడినట్టు చెప్పుకొచ్చింది. దానిపైనా మంచు లక్ష్మీ సెటైర్ వేసింది.

Manchu Lakshmi Comments On Rakul Preet Corona Post
Manchu Lakshmi Comments On Rakul Preet Corona Post

కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్వయంగా నాకు నేనుగా క్వారంటైన్‌లోకి వెళ్లాను. నాకు ఇప్పుడు బాగానే ఉంది.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను.. మళ్లీ త్వరలోనే షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెడతాను.. నన్ను కలిసిన ప్రతీ ఒక్కరూ పరీక్షలు చేసుకోండి.. మీరంతా జాగ్రత్తగా ఉండండి అని రకుల్ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌కు మంచు లక్ష్మీ వెరైటీగా రియాక్ట్ అయింది.

తనకు కరోనా వచ్చిందని రకుల్ చేసిన పోస్ట్‌కు మంచు లక్ష్మీ ఫన్నీ కామెంట్ పెట్టింది. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను కానీ నాకు నెగెటివ్ వచ్చింది.. ఈ ఏడాది మొత్తంలో మోస్ట్ నెగెటివ్ పర్సన్‌ని నేనే అంటూ మంచు లక్ష్మీ కౌంటర్ వేసింది. దీనికి రకుల్ హహహ అని నవ్వేసింది. ఇప్పుడే కాదు ఎప్పటికీ నెగెటివ్‌గానే ఉండాలని కోరుకుంటున్నాని రకుల్ చెప్పుకొచ్చింది. మొత్తానికి రకుల్ కరోనా విషయం ఏమో గానీ ఈ ట్వీట్లు మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.