టాలీవుడ్‌లో మంచు లక్ష్మీ అంటే ఓ బ్రాండ్. ఇంగ్లీష్ తెలుగు పదాలను కలిపి వాడటంలో ఆమె స్టైలే వేరు. కిందపడి దోర్లాలన్నా, నిలదిస్‌పై అయినా సరే అది మంచు లక్ష్మీకే సొంతం. మంచు లక్ష్మీపై వచ్చే ట్రోల్స్ మరేతర సెలెబ్రిటీలపై రావు. ఆమె మాట్లాడే మాటలు, చేసే చేష్టలు మీమర్స్‌కు ఫుల్ పనిని ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మంచు లక్ష్మీపై విపరీతమైన మీమ్స్ వస్తుంటాయి. మోహన్ బాబు సైతం ఇలా మీమర్స్, ట్రోలర్స్‌కు ఎన్నో సందర్భాల్లో దొరికిపోయాడు.
అయితే మంచు లక్ష్మీ తాజాగా కొన్ని విషయాలను బయటకు చెప్పేసింది. తాను ఓ హీరోకు పెళ్లి అయిందని తెలియడంతోనే ఏడ్చేసిందట. ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాలను చెప్పేసింది. తాను ఆమిర్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడని తెలిశాక ఏడ్చేశానని, రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని మంచు లక్ష్మీ తెలిపింది. తాను ఆమిర్ ఖాన్‌కు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చింది. అందుకే అలా ఏడ్చేశానని పేర్కొంది.
ఆమిర్ ఖాన్ చేసే సినిమాలు.. ఒక్కో సినిమా తరువాత మరో సినిమాను ఎంపిక చేసుకునే విధానం, ఆయన నటనా అన్నీ ఇష్టమని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. తాను ఆమిర్ ఖాన్, నాగార్జునలకు వీరాభిమాని, వారిద్దరూ పేర్లు విన్నా ఏదో అయిపోతుందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. మొత్తానికి మంచు లక్ష్మీ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్, అందులో మంచు లక్ష్మీ నవ్వులు వైరల్ అవుతున్నాయి.