రచ్చకెక్కిన మంచు వారి ఇంటి గుట్టు.. ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చిన తండ్రి, కొడుకులు!

మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయటంతో ఇంటి గుట్టు కాస్త రచ్చకెక్కింది. తనకు ప్రాణహాని ఉందని గుర్తుతెలియని పదిమంది వ్యక్తులు ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే మనోజ్ కంప్లైంట్ చేసిన కొన్ని గంటల తర్వాత మంచు మోహన్ బాబు మనోజ్ పై రాచకొండ సిపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను చిన్న కొడుకు మనోజ్ కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయడం గమనార్హం.

నేను సీనియర్ సిటిజన్ ని,నేను జల్పల్లిలో 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. మనోజ్ నాలుగు నెలల కింద ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇప్పుడు తిరిగి వచ్చి కలవరం సృష్టిస్తున్నాడు. మౌనిక, మనోజ్ నా ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. నా ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయమని నన్ను బెదిరించారు, మాదాపూర్ లోని నా ఆఫీసులో సిబ్బందిని కూడా బెదిరించారు. మనోజ్, మౌనిక నాకు హాని తల పెట్టాలని చూస్తున్నారు.

నా భద్రత, నా విలువైన ఆస్తుల విషయంలో భయపడుతున్నాను. మనోజ్ పై అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. అయితే మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ లో పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అరిచారని, తమపై దాడి చేశారని చెప్పారు. అంతేకానీ అందులో మోహన్ బాబు, విష్ణు పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే క్రమంలో గాయాలయ్యాయని మాత్రం మనోజ్ తెలిపాడు.

అయితే ఘటన జరిగిన తరువాత కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అనే వ్యక్తులు సిసి ఫుటేజ్ ని మాయం చేశారని కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్. మనోజ్ కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. 100 కి డయల్ చేయగానే మేము రెస్పాండ్ అయ్యి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని అయితే అక్కడ మనోజ్ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ లేరని పోలీసులు చెప్పటం గమనార్హం.