Manchu Family: భూమా మౌనికతో మనోజ్ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదా… షాకింగ్ విషయాలు చెప్పిన పనిమనిషి?

Manchu Family: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ కుటుంబంలో చోటు చేసుకున్న గొడవలు గురించి పూటకొక విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కుటుంబంలోని వ్యక్తులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లు చేసుకోవడం వంటివన్నీ జరుగుతున్నాయి. అసలు మంచు కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించని విధంగా గొడవలు పడుతున్నారు.

ఇలాంటి తరుణంలోని మోహన్ బాబు ఇంట్లో పని చేసే పని మనిషి లైన్లోకి వచ్చారు. ఈమె ఈ గొడవల గురించి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పనిమనిషి మాట్లాడుతూ అసలు వీరి మధ్య జరుగుతున్న గొడవ ఆస్తుల గురించి కాదని తేల్చి చెప్పారు.. ఇంట్లో స్టాఫ్ కోసమే గొడవ పడ్డారని ఈమె అసలు విషయం బయటపెట్టారు.

శనివారం సాయంత్రం పెద్దయ్య గారి దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేసారు దీంతో పెద్దయ్య ఆ వ్యక్తిని కొట్టాడు ఆదివారం ఉదయం మనోజ్ వచ్చి మరి ప్రసాద్ అనే వ్యక్తిపై చేయి చేసుకున్నారు. దీంతో పెద్దయ్య నా స్టాఫ్ ని నేను మందలించుకుంటాను నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అంటూ మనోజ్ బాబును తోసారు.

ఇలా వీరి మధ్య గొడవ మొదలైంది అలాగే పాత విషయాలు కూడా ఇప్పుడు బయట పెడుతూ గొడవపడ్డారని తెలిపారు. ఇక పెద్దయ్య గారికి విష్ణు అన్నకు మనోజ్ బాబు మౌనికమ్మను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ఒక బాంబు పేల్చారు. ఇక ఈ గొడవలో మనోజ్ బాబుకు ఏ విధమైనటువంటి దెబ్బలు కూడా తగలలేదని పనిమనిషి చెప్పారు. దీంతో పనిమనిషి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక మోహన్ బాబు గురించి కూడా మనోజ్ మాట్లాడుతూ నేను డబ్బు కోసం కాదు ఈ పోరాటం చేస్తుంది ఆత్మగౌరవం కోసమని ప్రతి గొడవలోనూ నా భార్యను నా పిల్లలను కూడా లాగుతున్నారు అంటూ మనోజ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే.