‘హరోంహర’లో దేవి పాత్ర విడుదల

‘పవర్‌ ఆఫ్‌ సుబ్రమణ్యం’ నవంబర్‌ 22న విడుదల కానుంది. అంతకంటే ముందు సుధీర్‌ బాబు పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’ మేకర్స్‌ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ‘సెహరి’ ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్‌సి పతాకంపై సుమంత్‌ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక శర్మను దేవి గా పరిచయం చేస్తూ మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో మాళవిక చీరలో అందంగా, సాంప్రదాయకంగా ఆకట్టుకుంటోంది. ఆమె లార్డ్‌ సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి చిరునవ్వుతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్‌ లుక్‌ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాలో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటీవలే ఆయన క్యారెక్టర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్‌ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్‌ విశ్వనాథన్‌ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ది రివోల్ట్‌.. అనేది ’హరోం హర’ ట్యాగ్‌ లైన్‌. ఇది సుధీర్‌ బాబు కెరీర్‌లో హై బడ్జెట్‌ మూవీగా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.