కమల్ హాసన్ – బాలకృష్ణ.. ఇప్పుడు రామ్ కోసం మరో హీరో?

Andhra King Thaluka: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను కొత్తగా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో భారీ హిట్ అందుకున్న రామ్, తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేసినా, ఆశించిన ఫలితం రాలేదు. అయితే, ఇప్పుడు మరింత వైవిధ్యమైన కథతో ముందుకు వస్తున్నాడు. తాజాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, స్టోరీ పరంగా కొత్తదనం ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే, ఇందులో అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. ‘ఆంధ్రా కింగ్’ పాత్ర రామ్‌కు సంబంధించినదేనా? లేక మరొక హీరోకా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సినిమాలో ప్రధానమైన క్యారెక్టర్ ఓ సీనియర్ స్టార్‌ది అని టాక్. దర్శకుడు మహేష్ బాబు మొదట ఈ పాత్ర కోసం కమల్ హాసన్, బాలకృష్ణను సంప్రదించినా, చివరకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇది మల్టీస్టారర్‌గా తెరకెక్కే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే, రామ్ కెరీర్‌లో మరో కీలక ప్రయోగంగా నిలుస్తుంది.

ఈ సినిమాలో రామ్ పాత్ర పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని అంటున్నారు. ఊహించని పరిణామాల మధ్య ఓ యువకుడిగా, తన పాత్రను కొత్త మలుపు తిప్పేలా దర్శకుడు డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ సినిమాల నుంచి కాస్త వెనక్కి వెళ్లి, తన ఎనర్జీని సరికొత్త యాంగిల్‌లో ప్రదర్శించేందుకు రామ్ సిద్ధమయ్యాడని సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, 2024 ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సీనియర్ హీరోతో రామ్ స్క్రీన్ షేర్ చేసుకుంటే, ఇది పక్కా మల్టీస్టారర్ మూవీ అవుతుంది. మరి, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ నిజమేనా? మోహన్ లాల్ క్యారెక్టర్ రేంజ్ ఏంటీ? అన్నది అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.