Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ ను వీడనున్న మహేష్… వైల్డ్ కార్డు ఎంట్రీతో బాబా మాస్టర్?

BigBoss Non Stop  Telugu: తెలుగు టెలివిజన్ లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది.పలు భాషలలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో 24/7 ఓటిటి లో ప్రసారం అవుతోంది. మునుపటి సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కి ప్రేక్షకాదరణ తగ్గిందనే చెప్పాలి. ఏడు వారాల క్రితం 17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లో ఇప్పటికే 6 మంది ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారం బిందు మాధవి, అరియాన, అఖిల్, శివ, అనిల్, నటరాజ్‌, మిత్రా శర్మ, మహేష్ విట్టా నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరిలో బిందు మాధవి, అఖిల్ అత్యధిక ఓట్లతో ముందు వరుసలో ఉన్నారు. శివ, అరియానకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఎలిమినేషన్ గురించి భయపడాల్సిన పని లేదు. మహేష్ మునుపటి సీజన్ కంటే ఈ సీజన్ లో బెటర్ గా గేమ్ ఆడుతున్నప్పటికీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మహేష్ అని రూమర్లు హల్చల్ చేస్తున్నాయి.

ఈవారం ఎలిమినేషన్ లో మహేష్ ని కావాలని ఎలిమినేట్ చేశారంటు వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో మహేష్ మిగిలిన హౌస్మేట్స్ కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నప్పటికీ కావాలనే అతడిని గేమ్ నుండి తప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఎప్పుడు అందరి మద్య పోట్లాటలు తప్ప కామెడీ ఎం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ వారం మహేష్ ను ఎలిమినేట్ చేసి అతని స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బాబా భాస్కర్ మాస్టర్ ని పంపనున్నట్టు సమాచారం. మరి ఈ వారం ఎలిమినేషన్ గురించి వచ్చిన వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.