ఆ బాలీవుడ్ బ్యూటీకి మహేష్ స్పెషల్ ట్రీట్‌మెంట్.. అందుకు కారణం నమ్రత అంటున్నారు ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోడ్కర్ గురించి అందరికీ తెలిసిందే. మహేష్ ని పెళ్ళి చేసుకోక ముందు మహేష్ తో వంశీ, మెగాస్టార్ చిరంజీవి తో అంజి వంటి సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోను హీరోయిన్ గా నటించి పాపులారిటీని సంపాదించుకుంది. మహేష్ ని ఎళ్ళి చేసుకున్నాక పూర్తిగా సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి కుటుంబాన్ని చూసుకుంటుంది. అంతేకాదు మహేష్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలను చూసుకుంటూ సపోర్ట్ గా ఉంది.

How did Mahesh Babu fall in love with Namrata Shirodkar? - Movies News

ముఖ్యంగా మహేష్ కి కథ చెపడానికి వచ్చే రచయిత, దర్శకులను చక్కగా చూసుకోవడం.. గౌరవించడం చూసి ఇండస్ట్రీ వర్గాలందరూ గొప్పగా ప్రశంసిస్తుంటారు. అంతేకాదు కథ ల విషయంలో నమ్రత జడ్జ్‌మెంట్ బావుంటుందని మహేష్ కి ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయంటే సగం క్రెడిట్ నమ్రతదే అని చెప్పుకుంటున్నారు.

అలాగే మహేష్ కి ఏ హీరోయిన్ అయితే కొత్తగా కమిటవుతున్న సినిమా కథ లో సెట్ అవుతుందో కూడా బాగా సలహాలిస్తుందని సమాచారం. ఆ రకంగానే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ ని మహేష్ సినిమా సర్కారు వారి పాట కి సజెష్ చేసిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ లీడ్ కి నమ్రత.. సాయీ మంజ్రేకర్ ని తీసుకోమని సూచించిందట.

Saiee Manjrekar Images - Telugu Actress Photo Galleries Latest Photos  Updated-TeluguStop

నమ్రత సలహాలు తప్పకుండా పాటించే మహేష్ సాయీ మంజ్రేకర్ ని సర్కారు వారి పాట లో తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అలాగే మహేష్ సొంత నిర్మాణంలో అడవి శేష్ హీరోగా రూపొందుతున్న బయోపిక్ మేజర్ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అంతేకాదు సాయీ మంజ్రేకర్ ని మహేష్ దంపతులు స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారట. అందుకు కారణం సాయీ మంజ్రేకర్ నమ్రత కి అత్యంత సన్నిహితురాలు కావడమే అని తెలుస్తుంది.