మహేష్ కి కథ నచ్చితే సుధ కొంగర తో సినిమాకి రెడీ..?

ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా.. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకురాలు సుధ కొంగర. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు దర్శకురాలిని, సూర్య ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దర్శకురాలి ప్రతిభ సూర్య మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కి కితాబులిస్తున్నారు. మొన్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి… దర్శకురాలు.. హీరో సూర్య గురించి మాట్లాడాడు. త్వరలో మీతో వర్క్ చేయాలని ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Sudha Kongara's hard work pays off with Aakasam Nee Haddura

కాగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా చూసి దర్శకురాలు సుధ కింగర మీద ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే సూర్య ని పొగడ్తలతో ముంచేశాడు. అంతేకాదు ఒకవేళ సుధ కొంగర గనక మహేష్ కి సరిపోయో కథ తీసుకు వస్తే ఖచ్చితంగా సినిమా చేసే ఆకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతగా సుధ కొంగర టేకింగ్ మహేష్ బాబు ని ఇంప్రెస్ చేసిందట. ఇప్పటికే సుధ కొంగర తెరకెక్కిస్తున్న సినిమాలు ఎలా ఉంటాయో కోలీవుడ్ .. టాలీవుడ్ హీరోలకి .. దర్శక నిర్మాతలకి అర్థమైంది. రియలిస్టిక్ కథాంశం తో హ్యూమన్ ఎమోషన్స్ ని జోడించి హృదయానికి హత్తుకునే సినిమాని వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు సుధ కొంగర.

ఇదే ఈ దర్శకురాలికి వరస సక్సస్ ల తో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. ఇప్పటి వరకు చేసిన హిందీలో “సాలా ఖడూస్”, తమిళంలో “ఇరుది సుత్రు”, తెలుగులో వెంకటేష్ తో గురు తీసి బ్లాక్ బస్టర్ అందుకొని గొప్ప ప్రశంసలు దక్కించుకున్నారు. ఇక తాజాగా ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి.ఆర్. గోపీనాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సుధ కొంగర దర్శకత్వంలో నటించడానికి పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా సుధ కొంగర తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ లో కార్తి లేదా విజయ్ తో చేయబోతున్నట్టు సమాచారం.