మహేష్ మూవీ.. అక్టోబర్ మంట

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో పా ఇండియా లెవల్ లో ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్చి 22న ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. అయితే టీమ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమాని ఆగష్టు 11న సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డేట్ కూడా అఫీషియల్ గా కాకున్న ఇప్పటికే ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ కూడా ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ 11కి ఉండే అవకాశం లేదనే మాట టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఆ సమయానికి పూర్తయ్యే అవకాశం ఉండకపోవచ్చని త్రివిక్రమ్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే రిలీజ్ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అంత సంతృప్తికరంగా లేరనే టాక్. దీనికి కారణం కూడా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా సినిమా అక్టోబర్ నెలలోనే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడం విశేషం. ఇవి మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ వచ్చిన డిజాస్టర్ చిత్రాలైన వంశీ, బాబి, అతిథి అక్టోబర్ నెలలోనే రిలీజ్ అయ్యాయి.

ఈ నేపధ్యంలో సెంటిమెంట్ గా కూడా మహేష్ బాబుకి దసరా సీజన్ కలిసి రావడం లేదని భావించి ఆ టైమ్ లో రిలీజ్ వద్దని చెప్పినట్లు టాక్. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ లో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయొద్దు చెబుతున్నారు. దసరా టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ అవుతుంది. దీంతో పాటు హిందీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అక్టోబర్ లో కొన్ని పాన్ ఇండియా మూవీస్ కూడా వస్తున్నాయి. మరి త్రివిక్రమ్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి ప్లాన్ తో ఉన్నారు అనేది చూడాలి.