టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.
అయితే ఈ చిత్రం ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో కానీ ఒక్క మహేష్ విషయంలో తప్ప ఇంకెక్కడా పాజిటివ్ వైబ్ ఎక్కడా కనిపించడం లేదు. మెయిన్ గా పాటలు విషయంలో ఆడియెన్స్ సహా ఫ్యాన్స్ కూడా భారీగా డిజప్పాయింట్ అయ్యారు. అయితే సంగీతం కానీ సినిమా లిరిక్స్ కి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ సినిమా ఏమో కానీ రెండో సాంగ్ కి బాగా నెగిటివ్ వచ్చింది. దీనితో సినిమా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియాలో బరస్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో కుక్కలు మొరగడం ఎక్కువయిపోయింది. వీరిని ఎవరొకరు అదుపులో పెట్టాలని మేము కూడా సినిమా మీద ఇష్టంతోనే చేస్తామని సాంగ్ పై నెగిటివ్ చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు.
దీని తర్వాత ఒకటి రెండు ట్వీట్ లు చేసారు కానీ తర్వాత ఏమైందో కానీ మొత్తానికి తన ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టీవ్ట్ చేసేసి వెళ్లిపోయారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది అని చెప్పక తప్పదు. సాంగ్ పట్ల చేసిన భారీ ట్రోల్స్ మూలానే తాను సోషల్ మీడియా వదిలేసారు అని అంతా అంటున్నారు. మరి మళ్ళీ వస్తాడో లేదో చూడాలి.