వైరల్ : థమన్ పై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..అసలు కథ ఏమిటంటే..!

ఇప్పుడు ఎలాంటి సందేహం లేకుండా తెలుగు సినిమా సంగీతం దగ్గర అయితే సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ హవా నడుస్తుంది అని చెప్పాలి. దర్శకుడు త్రివిక్రమ్ తో ఎప్పుడు అయితే సినిమా చేసాడో అప్పుడు నుంచి థమన్ గతి, గమనం మారిపోయాయి.

అలా ఎన్నో భారీ హిట్ ఆల్బమ్స్ ఇస్తూ వస్తున్న థమన్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద ఎత్తున కాంట్రవర్సీగా మారాయి. మరి అసలు మేటర్ ఏమిటంటే థమన్ ఓటిటి లో ఓ షో కి గాను జడ్జి గా వ్యవహరించగా అందులో తన కెరీర్ లో బెస్ట్ హిట్ ఆల్బమ్స్ ఏవి అంటే అవన్నీ అల్లు అర్జున్ తో చేసిన రేస్ గుర్రం, సరైనోడు, అలాగే అల వైకుంఠపురములో సినిమాలే అని చెప్పడం మహేష్ ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు.

అసలు థమన్ కెరీర్ లో పది లోపే ఉన్న సినిమాలు టైం లో దూకుడు అఫర్ వస్తే ఆ సినిమా హిట్ తర్వాత థమన్ కేవలం రెండేళ్లలో 40 దగ్గరకి సినిమాలు చేసేసాడు అలాంటి సినిమాని థమన్ చెప్పుకోకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాతో అయితే నిర్మాతలను థమన్ ని తీసేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే థమన్ తన కామెంట్స్ పై ఏమన్నా స్పందిస్తాడో లేదో చూడాలి.