Mahesh: ఎన్టీఆర్ చరణ్ డాన్స్ పై కామెంట్స్ చేసిన మహేష్..!

Mahesh: భారతీయ చలనచిత్ర చరిత్రలో తెలుగు సినిమా స్థాయి ఏంటో రాజమౌళి మరొకసారి గుర్తు చేశారు. ఎన్టీఆర్ ,చరణ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ అభిమానులే కాకుండా సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా ఇది. దీంట్లో కొమరం భీం గా ఎన్టీఆర్, సీతారామరాజు గా చరణ్ అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.ఎన్టీఆర్ నటన పరంగా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీలు వీక్షించారు. సినిమా విడుదల అయినప్పటి నుంచి సినిమా మీద సెలబ్రిటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసిన మహేష్ బాబు కూడా ఈ సినిమా గురించి స్పందించారు.ఆర్ఆర్ఆర్’ సినిమా E.P.I.C!! అంటూ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ – ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, గతంలో ఎన్నడూ ఇలా మహేష్.. ఒక సినిమాని ఇంత అద్భుతంగా పొగడలేదు.మహేష్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాకు సంబంధించిన గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. కేవలం మాస్టర్ స్టోరీటెల్లర్ మాత్రమే ఇది చేయగలడు అని చెప్పుకొచ్చారు.తారక్, చెర్రీ స్టార్‌డమ్‌ను మించి గొప్పగా ఎదుగుతున్నారు. నాటు నాటు పాటలో గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేయలేదు. నిజానికి వారు గాల్లో ఎగిరారు.. అంటూ తారక్ చెర్రీ డాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు.సెన్సేషనల్ ఫిల్మ్ మేకింగ్‌లో రాజమౌళి మాస్టర్ అని చెప్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర విజయానికి అభినందనలు కూడా తెలియజేశారు .