సంక్రాంతికి మహేష్.! ఎవ్వరూ నమ్మరేంటి.?

సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందహో.! జనవరి 13న సినిమా రిలీజ్. 2024 సంక్రాంతికి సినిమా రాబోతోందిట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

గుర్తుందా.? ‘సర్కారు వారి పాట’ సినిమాని కూడా సంక్రాంతికే ప్లాన్ చేశారు. కానీ, వెనక్కి వెళ్ళింది. మరిప్పుడు, మహేష్ – త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి వస్తుందా.? అబ్బే, ఆ ఛాన్సే లేదంటున్నారు.

పైగా, మహేష్ అభిమానులే తమ అభిమాన హీరో సినిమా సంక్రాంతికి వస్తుందంటే నమ్మడంలేదాయె.! 2024 సంక్రాంతి కోసం ప్రభాస్ ఆల్రెడీ ‘ప్రాజెక్ట్ కె’ సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. రామ్ చరణ్ కూడా ఇప్పటికే తన సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ చేసేసుకున్నాడు.

అయినా, ఇంత తొందరగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని ఏం లాభం.? మహేషూ కాస్త ఆలోచించవయ్యా.?