త్రివిక్రమ్ సినిమాకి ముందు ఫ్యామిలీతో మహేష్ వెకేషన్.. కారణం అదేనా?

సాధారణంగా ప్రతి మనిషికి ఒక సెంటిమెంట్ అంటూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఫలానా తేదీన సినిమా విడుదల చేయాలి, సినిమా పేరు ఫలానా అక్షరంతోనే మొదలవ్వాలి, మా పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి అంటూ కొంతమందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. మహేష్ బాబు విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లు మూడు అక్షరాల పేరుతో ఉన్న అర్జున్, పోకిరి, అతడు వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఖలేజా, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ ఈ సెంటిమెంట్ గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు.

అయితే మహేష్ బాబు మరొక విషయంలో కూడా సెంటిమెంట్ ని ఫాలో అవుతాడు. మహేష్ బాబు ప్రతి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు. ఇలా కుటుంబంతో కలిసి మహేష్ బాబు వెకేషన్స్ కి వెళ్లడానికి చాలా ఇష్టపడతారు. షూటింగ్ మధ్యలో ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా, లేదంటే షూటింగ్ డిలే అయినా కూడా మహేష్ వెకేషన్ కి చెక్కేస్తాడు. ఇటీవల సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేశాడు.

అయితే త్రివిక్రమ్ సినిమా కి కూడా మహేష్ ఇదే సెంటిమెంట్ ఫాలో కానున్నారట. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇక 2023 సమ్మర్ లో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టటానికి ఇంకా మూడు వారాలు పైగా సమయం ఉండటంతో మహేష్ బాబు ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు వెకేషన్ నుండి తిరిగి వచ్చేలోపు త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో భారీ చెట్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.