ఇందిరా దేవి మరణం తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్?

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈమె మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రపంచం ఒక్కసారిగా కదిలి వచ్చి తనకు నివాళులు అర్పించారు.ఇక నేడు మహాప్రస్థానంలో ఇందిరాదేవి అంత్యక్రియలను మహేష్ బాబు హిందూ సాంప్రదాయాల ప్రకారం పూర్తి చేశారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు ఈమె అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున మహేష్ బాబు కృష్ణ అభిమానులు తరలివచ్చి తనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

ఇక మహేష్ బాబు తన కొడుకుగా తల్లికి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ సాంప్రదాయ బద్ధంగా పూర్తి చేశారు. ఇకపోతే తల్లి మరణం తర్వాత మహేష్ బాబు ఎంతో బాధలో ఉన్నప్పటికీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి నివసించిన ఇంటిని మహేష్ బాబు తన తల్లి పేరిట ఒక అనాధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇలా మహేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

తల్లి మరణించారని పుట్టేడు దుఃఖంలో ఉన్నటువంటి మహేష్ బాబు తన తల్లి స్వగృహాన్ని ఇతరులకు ఉపయోగపడేలా ఎంతో గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే మహేష్ బాబు ఇదివరకే తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్లు నిర్వహించి వారికి పునర్జన్మను ప్రసాదించిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండే మహేష్ బాబు తల్లి మరణం తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఎంతోమంది అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.