మహేష్ బాబు సర్కారు వారి పాట ని ఆ సినిమాలకి టార్గెట్ గా రిలీజ్ చేయబోతున్నాడా ..?

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో త్వరలో సెట్స్ మీదకి రాబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమా తెరకెక్కబోతోంది. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఓపెనింగ్ పూజా కార్యక్రమాలని జరుపుకుంది. కాగా ఈ నెలలోనే సెట్స్ మీదకి వస్తుందని అందరూ భావించారు. మేకర్స్ కూడా సర్కారు వారి పాట సినిమాని ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో మొదలవబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించబోతుంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ తర్వాత ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాలలో అలాగే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముందుగా దుబాయ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత టీం హైదరాబాద్ రానుందట. ఇక్కడ పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కోసం ప్రత్యేకమైన సెట్ ని నిర్మించగా ఆ సెట్ లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేయనున్నారట. అలాగే బ్యాక్ సెట్ లో నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ ని పూర్తి చేస్తారని సమాచారం.

ఇలా నాన్ స్టాప్ గా సర్కారు వారి పాట సినిమా ని కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విజయదశమి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే పవన్ కళ్యాన్ సినిమా.. ప్రభాస్ సలార్.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలు రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాన్ ఇండియన్ సినిమాలతో పోటీగా మహేష్ బాబు సర్కారు వారి పాట దిగబోతుందని అంటున్నారు. ఒకరకంగా సమ్మర్ నుంచే టాలీవుడ్ లో భారీ సినిమాల మధ్య పోటీ నెలకొనబోతోంది. సమ్మర్ కి ఆర్ ఆర్ ఆర్.. ఆచార్య..రాధే శ్యాం.. వకీల్ సాబ్ రాబోతున్నాయి.