Nijam Movie: మహేష్ బాబు నిజం సినిమాలో మురళీమోహన్ ను తొలగించిన డైరెక్టర్… కారణం అదే!

Nijam Movie: దర్శకుడు తేజ చిత్రం మూవీ బ్యానర్స్ పై ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా రక్షిత హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా నిజం. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా సెకండ్ హాఫ్ లో ఓ కీలక పాత్రలో నటించడం కోసం తేజ నటుడు మురళీ మోహన్ ని సంప్రదించారు.ఈ విధంగా ఈయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఎడిటింగ్ సమయంలో తన పాత్రను మొత్తం తీసేసి ఆయన స్థానంలో నటుడు ప్రకాష్ రాజ్ ను పెట్టి సినిమా షూటింగ్ చేశారు.

సినిమా విడుదలైన తర్వాత మురళీమోహన్ తన పాత్ర లేకపోవడం చూసి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో తనను తీసుకుని తర్వాత తనని తొలగించడం పట్ల ఎంతో అవమానకరంగా భావించిన మురళీమోహన్ ఏకంగా 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.అయితే సినీ పెద్దలు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి మురళీమోహన్ కు నష్టపరిహారం కింద 5 లక్షల రూపాయలను ఇప్పించారు. అయితే ఈ విధంగా మురళీమోహన్ పాత్రను తీసివేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

ఈ సినిమాలి మురళీమోహన్ తన బాడీ లాంగ్వేజ్ కు, లిప్ మూమెంట్ ఏమాత్రం సెట్ కాలేదని అందుకే తనని తొలగించి తన స్థానంలో నటుడు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నామని వెల్లడించారు.అయితే ఈ విషయం పై పలువురు విమర్శలు చేస్తూ ఈ విషయాలన్నీ ముందుగా అతని సంప్రదించినప్పుడు తెలుసుకోవాలని ఇలా సినిమాల్లో తీసుకొని షూటింగ్ చేసిన తర్వాత ఆయనని తొలగించడం సరైన పద్ధతి కాదంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.