మహేష్‌బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ డిజాస్టర్ టాక్‌తో తొలి రోజు కాస్త భయపెట్టిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏమీ అంత గొప్పగా పుంజుకోలేదు. కాకపోతే, సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది.. వసూళ్ళ పరంగా డిజాస్టర్ అనే ఇమేజ్ నుంచి తప్పించుకునే అవకాశం దొరికింది.
బ్రేక్ ఈవెన్ అయిపోయిందహో.. అంటూ చిత్ర నిర్మాత చెప్పేసుకోవడం, అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకోవడం.. ఇదంతా ‘మహేష్’ సినిమాలకి మామూలే. ‘గుంటూరు కారం’ సినిమాకీ అదే జరుగుతోంది.
అయితే, తెరవెనుక కథ వేరేలా వుంది. ఎవరు నష్టపోయినా తాను ఆదుకుంటానంటూ మహేష్ నుంచి సందేశం వెళ్ళడంతో, ఎక్కడా ఎవరూ నష్టాల గురించి మాట్లాడటంలేదట.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నష్టాలు బాగానే వుండొచ్చని తెలుస్తోంది. అదెంత.? అన్నదానిపై కొద్ది రోజుల్లో స్పష్టత రావొచ్చు. త్రివిక్రమ్ – మహేష్ కాంబో కారణ:గా పెద్ద రేట్లకు అమ్మేయడం వల్లే ఈ పరిస్థితి.
ఆల్రెడీ గ్రాస్ లెక్కలు రెండొందల కోట్లను దాటేశాయి. మూడొందల కోట్లూ దాటేసి.. నాలుగొందల కోట్ల దాకా తీసుకెళ్ళిపోతారేమో.! మహేష్ సినిమాలకు ఇలాంటి అతి ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది.