SSMB28 ప్రకాష్ రాజ్ వద్దు బాబోయ్.!

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. కారణం, త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో సినిమా గురించే.! సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్దే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో ఐరన్ లెగ్ అయిపోయింది. ఆ విషయంలోనే సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు.

తాజాగా, ఈ సినిమా కోసం ‘తాత’ పాత్రలో ప్రకాష్ రాజ్ అన్న గాసిప్ బయటకు రావడంతో, అభిమానుల ఆందోళన రెట్టింపయ్యింది. త్రివిక్రమ్ సినిమాల్లో తాత పాత్రలకు స్పెషల్ క్రేజ్ వుంటుంది. అలాగే, ఈ సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ త్రివిక్రమ్ డిజైన్ చేశాడట.

కానీ, ఆ తాత పాత్రలో ప్రకాష్ రాజ్ వద్దే వద్దంటున్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు. ఈ మధ్య ఈ తరహా డిమాండ్లు, హెచ్చరికలు అభిమానుల నుంచి ఎక్కువైపోయాయ్.