‘పోచర్‌’ వెబ్‌సీరిస్‌ చూసి మహేశ్‌ బాబు ఎమోషనల్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ నిర్మాతగా మారి తెరకెక్కించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘పోచర్‌’. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి అలియా భట్‌ నిర్మించింది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ చూసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబ ‘పోచర్‌’పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎవరైనా ఏనుగులను అలా ఎలా చంపగలరు. వారికి మానవత్వం లేదా? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకడం లేదా? ఈ కైమ్ర్‌ థ్రిల్లర్‌ చూస్తున్నప్పుడు నా మైండ్‌ లో ఇవే ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి.

ఈ జెంటిల్‌ జెయింట్స్‌ ని కాపాడుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరు పోరాడాలి అంటూ మహేష్‌ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. మలయాళ నటులు నిమిషా సజయన్‌, రోషన్‌ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు ఎవ్మిూ అవార్డు విన్నర్‌ రిచీ మెహతా దర్శకత్వం వహించాడు.

అమెజాన్‌ ప్రైమ్‌ లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌ కథ విషయానికి వస్తే.. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, అడవుల్లో వన్య ప్రాణులపై దాడుల చేసే వారిపై ఈ సిరీస్‌ వచ్చింది. ఇక వారిని పట్టుకునేందుకు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారులు, కార్మికులు, లోకల్‌ పోలీసులు ఎం చేశారు అనేది ఈ సిరీస్‌ కథ.