అఖిల్ ఏజెంట్ సినిమా టీజర్ పై స్పందించిన మహేష్.. ఏమన్నారంటే?

అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ ఈ సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ భారత గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో సాప్ట్ రోల్ లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం భారీగా కండలు పెంచాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఏజెంట్ సినిమా టీజర్ విడుదల చేశారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తోన్న ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. నిన్ను ప్రతిష్ట నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో టీజర్ విజువల్స్, మూవీ థీమ్ అదిరిపోయాయని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్పారు. మహేష్ బాబు చేసిన ట్వీట్ పై అఖిల్ స్పందిస్తూ..థాంక్యూ బ్రదర్‌, మీ సపోర్ట్‌, ప్రోత్సాహం చాలా విలువైనది’ అంటూ రీట్వీట్ చేశాడు.

ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సినిమాలో అఖిల్ భారీగా కండలు పెంచి 8 ప్యాక్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ ఏజెంట్ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా సత్తా నిరూపించుకోబోతున్నడు. ఇదిలా ఉండగా ఈ ఏజెంట్ సినిమా కోసం అఖిల్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడని సమాచారం. సినిమా విడుదలయిన తర్వత వచ్చే లాభాల్లో వాటా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏజెంట్ మూవీ టీజర్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచింది.