Mahesh Babu: త్వరలో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ.. ఇదంతా నిజమేనా?

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన తోటి హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో కూడా దూసుకుపోతున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం నార్మల్ సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నాడు. కానీ తాజాగా మహేష్ బాబు హిందీ సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. బాలీవుడ్ డైరెక్టర్ సూరజ్ భర్జత్య మహేష్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈయన ఇప్పటికే నమ్రతతో చర్చలు జరిపినట్లు తెలిసింది. కానీ మహేష్ బాబు మాత్రం తనకు తెలుగు సినిమాలలో మాత్రమే ఇంట్రెస్ట్ ఉందని.. హిందీ సినిమా చేసే ఆసక్తి లేదని అన్నట్లు తెలిసింది. ఇక ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.