ఇవాళ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈసందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ జపమే. ప్రభాస్ గురించే ట్వీట్లు, పోస్టులు, ఫోటోలు, హ్యాష్ టాగ్ లు. వాట్ నాట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా కిక్ ఎక్కించే రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ప్రభాస్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ లో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్. మీకు అనంతమైన విజయం, సంతోషం, ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ ట్వీట్ చేసిన మహేశ్ బాబు.. ప్రభాస్ కు కాకుండా… వేరే వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ ను ట్యాగ్ చేశారు.
నిజానికి ప్రభాస్ కు ట్విట్టర్ ఖాతా లేదు. ఆయన ట్విట్టర్ లో లేరు. యాక్టర్ ప్రభాస్ పేరుతో ఎవరో ప్రభాస్ ఫ్యాన్ అకౌంట్ ను మెయిన్ టెన్ చేస్తున్నారు. అది తెలియక మహేశ్ బాబు.. ఆ అకౌంట్ ను ట్యాగ్ చేశారు. తర్వాత వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.
ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ వేదికగా అర్జున్ సినిమా వేడుకలో అతిథిగా వచ్చిన ప్రభాస్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.