అండర్ కవర్ పోలీస్ గా మహేష్ బాబు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదటి, రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక నేటి నుంచి మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. త్రివిక్రమ్, మహేష్ కలయికలో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడం ఆడియన్స్ ఏదో కొత్త పాయింట్ ని ఈ సారి కూడా టచ్ చేసే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తుంది.

మహేష్ తో త్రివిక్రమ్ చేసిన రెండు సినిమాలలో ఇంటరెస్టింగ్ పాయింట్ ని ఎలివేట్ చేశారు. ఈ సారి కూడా అలాంటిది ఏం ఉంటుంది అనేది కూడా ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మాటల మాంత్రికుడి సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుటుంబ కథలే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ బంధాలలో ఉండే బలమైన సంఘర్షణని తెరపై ఆవిష్కరిస్తూ ఆయన హిట్స్ కొడుతున్నాడు. త్రివిక్రమ్ బలం కూడా కథ కంటే పాత్రల మధ్య ఉండే సంఘర్షణ అని చెప్పాలి.

అతడు సినిమాలో కూడా అలాంటి బలమైన సంఘర్షణ తాత మనవాడి మధ్య ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్. గతంలో పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇదే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తాడని సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.

అయితే కథ మొత్తం కుటుంబ బంధాల మధ్య సాగుతుందనే మాట వినిపిస్తుంది. ఒక సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా పల్నాడుకి వచ్చిన హీరో తన కుటుంబంతో కలిసి ఉంటాడని, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. తన మిషన్ ని ఎలా పూర్తి చేసాడు అనే పాయింట్ చుట్టూ కథని త్రివిక్రమ్ నడిపించాడు అనేది టాక్. ఈ కారణంగా సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసినట్లు బోగట్టా.