Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా #SSMB@28 కొత్త అప్ డేట్.. విడుదల అప్పుడే!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కళావతి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. మహేష్ సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. ఇక మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు ఒప్పుకున్నారు. రాజమౌళి సినిమా మల్టీ స్టార్రర్ కాగా కథ సిద్ధం చేసే పనిలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక మహేష్ బాబు దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు. అతడు ఖలేజా తర్వాత మహేష్ మూడో సారి త్రివిక్రమ్ తో సినిమా తీయబోతున్నారు. త్రివిక్రమ్ కుటుంబ కథ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తారు. మహేష్ తో కూడా కుటుంబ నేపథ్యంలో సాగే చిత్రాన్ని ప్లాన్ చేశారట. ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఇక మిగిలిన నటి నటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

హైదరాబాద్ లో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ రాజస్తాన్ లో ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. 2023 జనవరిలో సినిమా రిలీజ్ కు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 2023 లో విడుదల కాబోతుందని లేదంటే మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాలో బిజీ కానున్నారు.