వైరల్ : మహేష్, శ్రీలీల ఓ మాస్ సాంగ్..కుర్చీ మడతపెట్టి

రానున్న రోజుల్లో టాలీవుడ్ ఫ్యాన్స్ కి మాత్రం మాస్ జాతర స్టార్ట్ కానుంది అని చెప్పాలి. ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి బరిలో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న మాస్ చిత్రం “గుంటూరు కారం” కూడా రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రంని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా మహేష్ త్రివి కాంబో లో మూడో సినిమా ఇది కావడంతో హైప్ తారా స్థాయిలో ఉంది. ఇక ఈ మాస్ ప్రాజెక్ట్ పై ఎప్పటికపుడు సినిమా అప్డేట్స్ మేకర్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన రెండో సాంగ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసిన మేకర్స్ ఈసారి వడ్డీతో సహా తిరిగిచ్చేసేలా ఉన్నారని చెప్పాలి.

ఇప్పుడు నిర్మాత నాగవంశీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ సహా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలీల మహేష్ బాబు పై ఓ మాస్ సాంగ్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ తో సాంగ్ విజువల్స్ కొన్ని చూసాను ఈ సాంగ్ మాత్రం మాములుగా ఉండదు అని వంశీ చెప్తున్నాడు.

ఇంకా నాటుగా చెప్పాలి అంటే ఇటీవల బాగా ఫేమస్ అయ్యిన డైలాగ్ కుర్చీ మడతపెట్టి.. ఆ లెవెల్లో ఈ సాంగ్ ఉంటుంది అని పోస్ట్ చేసాడు. మరి పోస్టర్ చూసినట్టు అయితే మహేష్ శ్రీలీల ఇద్దరు పక్కా మాస్ సాంగ్ లో ఇరక్కొట్టేసేలా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ సాంగ్ కి అయినా థమన్ మహేష్ ఫ్యాన్స్ ని మెప్పించే రేంజ్ ట్యూన్ ఇచ్చాడో లేదో అనేది వేచి చూడాలి మరి..