చేతులు కలపనున్న మహేష్ – రామ్ చరణ్.!

మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య మంచి స్నేహ సంబంధం వున్న సంగతి తెలిసిందే. వయసులో చాలా తారతమ్యం వున్నప్పటికీ ఈ ఇద్దరూ చాలా స్నేహంగా మసలుతుంటారు. వెకేషన్లలో ఫ్యామిలీస్‌తో కలిసి కంబైన్డ్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ స్నేహం ఇప్పుడు బిజినెస్ పార్ట‌్‌నర్‌షిప్‌గా మారబోతోందనీ సమాచారం. మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి ఓ బిగ్ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారట.

అయితే, ఇందులో రామ్ చరణ్ పేరు కానీ, మహేష్ బాబు పేరు కానీ, కనిపించదట. వీరిద్దరి భార్యామణులు ఉపాసన, నమ్రతలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారట. అయితే, అది సినిమా ప్రాజెక్ట్‌నా.? లేక బిజినెస్ ప్రాజెక్ట్‌నా.? అనేది తెలియాల్సి వుంది. ఇప్పటికే నమ్రత పలు రెస్టారెంట్లు, హోటల్స్ బిజినెస్‌తో బిజీగా వుంటుంది.

అలాగే, ఉపాసనకు అపోలో ఆసుపత్రి బాధ్యతలు ఎక్కువ. ఇలా ఇంతవరకూ ఎవరి బిజినెస్‌లలో వారు బిజీగా వున్న ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారంటే అది సినిమా అయినా, లేదంటే, ఇతరత్రా బిజినెస్ అయినా ఇరు వర్గాల అభిమానుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చూడాలి మరి, అసలింతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో.!