వావ్..”భోళా శంకర్” కి ఇదేం మ్యాజిక్..

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే రెండు సెన్సేషనల్ హిట్ లను మన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి నటసింహం బాలయ్య లు అయితే అందించేసారు. ఇక మళ్ళీ ఈ ఏడాది లోనే రెండో సినిమాతో రాబోతున్న ఇద్దరు స్టార్ హీరోలలో మొదట ఐతే మెగాస్టార్ నే రాబోతున్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ తో తెరకెక్కించిన చిత్రం “భోళా శంకర్” కోసం తెలిసిందే. కాగా ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం వేదాళం కి రీమేక్ గా తెరకెక్కించగా షూటింగ్ డబ్బింగ్ అన్ని పనులు అయిపోయి జస్ట్ రిలీజ్ కి రాబోతుంది. కాగా ఈ చిత్రం విషయంలో ఇపుడు ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటున్నాయి.

అయితే ఇది రీమేక్ అని మెగా ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ పక్కన పెట్టేస్తారు అని చాలా మందికి అనిపించింది. కానీ ప్రెజెంట్ సినిమాకి కనిపిస్తున్న ట్రెండ్ చూస్తుంటే గట్టి ఓపెనింగ్స్ సినిమాకి నమోదు అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మెయిన్ గా ఆన్లైన్ ట్రెండింగ్ లో భోళా మేనియా కనిపిస్తుంది.

బుక్ మై షో లో బుకింగ్స్ డెఫినెట్ గా అదిరిపోతాయ్ అని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నారు. అయితే మెయిన్ గా మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉన్నారని తెలుస్తుంది. పైగా సినిమా మాస్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది అని అంటున్నారు.

అయితే దీనికి మరో ఉదాహరణ ఈ సినిమాకి యూఎస్ లో కూడా మంచి ప్రీమియర్ బుకింగ్స్ రిజిస్టర్ నమోదు కావడం విశేషం. దీనితో భోళా శంకర్ కి ఐతే ఏదో మ్యాజిక్ జరిగే సూచనలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.