పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాధవీలత తాజాగా ఓ కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఎంత గొప్పోడో చెబుతూ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్‌లో భాగంగా ముగ్గురు అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసన వెంటనే పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అంతేకాకుండా ఓ భరోసా ఇస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు.
అలా వెంటనే రియాక్ట్ అయి ప్రెస్ నోట్ విడుదల చేయడంపై మాధవీలత స్పందించింది. ‘పీకే ఫ్యాన్స్‌కు చెబుతున్నా.. ఇతర ఏ హీరోలు గానీ, రాజకీయ నాయకులు గానీ ఇంత త్వరగా రియాక్ట్ అయిన వారిని ఈ రోజు వరకు ఎప్పుడూ చూడలేదు. బహిరంగంగా, అధికారికంగా ప్రకటన చేయడం.. ఎవ్వరూ చేయలేదు.. అదే పీకే మార్క్.
పవన్ కళ్యాణ్ ప్క్ష్యాన్స్‌కు నా తరుపు నుంచి ఓ విన్నపం.. మీరంతా ఆయన్ను ఇష్టపడుతుంటారు.. కానీ మీ అంతట మీరే సమస్యలో చిక్కుకుంటున్నారు. మీ జీవితాన్ని మీరే కోల్పోతున్నారు.. కానీ చివరకు మాత్రం పీకేకు చెడ్డ పేరు వస్తోంది. ఎందుకిలా?.. ఆయన ఎన్నడూ ఏదీ అడగలేదు. ఆయన పేరును చెడగొట్టకండి’అని మాధవీలత పేర్కొంది.