R Madhavan Son: స్విమ్మింగ్ పోటీల్లో రాణిస్తూ భారత దేశ ఖ్యాతిని పెంచుతున్న మాధవన్ కుమారుడు..!

R Madhavan Son: హీరో మాధవన్ తెలుగు, తమిళ వంటి పలు భాషల్లో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అందరూ మాధవన్ కుమారుడి గురించి చర్చించుకుంటున్నారు. అందుకు కారణం మాధవన్ కుమారుడు వేదాంత్‌ సాధించిన పథకాలు. వేదాంత్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఇప్పటే అనేక పథకాలు సాధించాడు. వేదాంత్ ప్రస్తుతం డెన్మార్క్‌లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌ పోటీల్లో పాల్గొని తన ప్రతిభతో స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్నాడు.

ఈ స్విమ్మింగ్ పోటీల్లో వేదాంత్ వరుసగా విజయాలు సాధిస్తూ ఎన్నో పథకాలను దేశానికి అందిస్తున్నాడు.
ఈ పోటీలో పాల్గొన్న వేదాంత్ ఇప్పటికే ఆదివారం రజత పతకం సాధించగా..సోమవారం రోజు గోల్డ్ మెడల్ సాధించాడు. మాధవన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు నెటిజన్లు వేదాంత్‌ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మాధవన్ తన కుమారుడు వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..” దేవుడి దయ , మీ అందరి ఆశీర్వాదం వల్ల వేదాంత్ వరుస విజయాలను అందుకుంటున్నాడు”. అని పోస్ట్ చేశాడు. వేదాంత్ గెలుపుకు కృషి చేసిన ఆయన గురువు ప్రదీప్ కి కూడా మాధవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆదివారం పది సెకండ్ల తేడాతో 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కోల్పోయిన వేదాంత్ సోమవారం మొదటి స్థానంలో గెలుపొంది గోల్డ్ మెడల్ సాధించాడు.