ఓటిటిలో “పొలిమేర 2” రిలీజ్ ఖరారు..ఎప్పుడు ఎందులోనంటే

రీసెంట్ టైం లోనే టాలీవుడ్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అయితే పలు క్రేజీ థ్రిల్లర్ హిట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ హిట్ చిత్రాల్లో కమెడియన్ సత్యం రాజేష్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “మా ఊరి పొలిమేర” పార్ట్ 2 కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని మొదటి భాగం మా ఊరి పొలిమేర కి సీక్వెల్ గా తీసుకొచ్చారు.

మరి మొదటి భాగం ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ దీని మీద క్రేజ్ తో మేకర్స్ పార్ట్ 2 ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ చిత్రం భారీ లాభాలు అందించి పెట్టింది. దీనితో మూడో భాగాన్ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇలా ఫ్రాంచైజ్ గా సాగుతున్న ఈ సినిమా పార్ట్ 2 ఓటిటి రిలీజ్ డేట్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.

ఈ సినిమా అయితే ఈ డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ ఆహా గోల్డ్ సభ్యులకి మాత్రం ఓ రోజు ముందే అంటే డిసెంబర్ 7నే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించగా చేతబడులు నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. మరి ఓటిటిలో చూడాలి అనుకునేవారు అయితే ఈ డిసెంబర్ 8 వరకు ఆగితే సరిపోతుంది.