లస్ట్ స్టోరీస్ 2… అందరూ కలిసి చూసే సినిమా

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ పెట్టారు. ఓవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇవిలా ఉండగానే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లోకి అడుగుపెట్టిన తమన్నా ఇప్పటికే తమిళంలో రెండు వెబ్ సిరీస్ లు, హిందీలో ఒకటి కంప్లీట్ చేసింది.

వీటి ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు కూడా బాగానే రీచ్ అయిపోయారు. ప్రస్తుతం హిందీలో లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ మూవీలో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి తమన్నా బోల్డ్ ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించడం విశేషం. నెట్ ఫిక్స్ లో జూన్ 29న రిలీజ్ కాబోయే ఈ మూవీపై నార్త్ ఇండియాలో మంచి హైప్ ఉంది.

నాలుగు విభిన్నమైన ప్రేమ కథలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్ యాక్టివిటీస్ లో తమన్నా బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా లస్ట్ స్టోరీస్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

అందులో ప్రారంభంలో తమన్నా, విజయ వర్మ మధ్య రొమాంటిక్ సన్నివేశాన్ని చూపించి ఆపై ఆమె సినిమా గురించి చెప్పిన వ్యాఖ్యలను రిప్రజెంట్ చేశారు. లస్ట్ స్టోరీస్ టైటిల్ చూసి మోసపోవద్దు అని, ప్రతి ఒక్కరు, అన్ని వయస్సుల వారు చూడదగ్గ కంటెంట్ ఇందులో ఉందని తమన్నా చెప్పడం విశేషం. ప్రేమలోని విభిన్న కోణాలను, డిఫరెంట్ భావోద్వేగాలు లస్ట్ స్టోరీస్ లో చూపించారు.

ప్రతి ఒక్కరికి ఈ ఎమోషన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఎవరో వస్తున్నారని భయపడి మూవీ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అందరి మధ్యలో ధైర్యంగా చూడండి అంటూ తమన్నా వీడియోలో చెప్పుకొచ్చారు. మరి ఈ వెబ్ సిరీస్ మిల్కీ బ్యూటీ కి ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.