బాలయ్యకి లక్కీ ఛాన్సులే.!

బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ‘భగవంత్ కేసరి‘ సినిమాకి మంచి బజ్ ఏర్పడుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీలీల ఓ కీ రోల్ పోషిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా శ్రీలీల కారణంగానే ఈ సినిమాకి మంచి ఎస్పెట్ వస్తోందని అంటున్నారు.

అలాగే, అనిల్ రావిపూడి కారణంగా ఓవర్సీస్‌లోనూ మంచి సందడి కనిపిస్తోంది ‘భగవంత్ కేసరి’కి. అనిల్ రావిపూడి సినిమాలు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు రాబడుతుంటాయ్.

ఆ కారణంగా మాస్ సినిమా అయినప్పటికీ బాలయ్య సినిమాకి అక్కడ మంచి మార్కెట్ జరుగుతోందనీ తెలుస్తోంది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

‘వీర సింహారెడ్డి’ టైమ్‌లోనూ ఈ జోరు ఊహించారంతా. అయితే, ఆ టైమ్‌లో ‘వాల్తేర్ వీరయ్య’ కారణంగా ‘వీర సింహారెడ్డి’కి గట్టి దెబ్బే తగిలింది.

కానీ, ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. సింహం సింగిల్‌గా అని చెప్పలేం కానీ, రవితేజ తదితర హీరోల సినిమాలున్నప్పటికీ ‘భగవంత్ కేసరి’కి ప్రత్యేకమైన బజ్ కనిపిస్తోందంటున్నాయంటున్నారు సినీ మేథావులు.

అలాగే సినిమా అవుట్ పుట్ పైనా మంచి నమ్మకంతో వున్నారు చిత్ర యూనిట్. చాలా బాగా వచ్చిందంటున్నారు సినిమా. అన్నట్లు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.