శేఖర్ కమ్ముల హిట్ మూవీ ‘ఫిదా’ విడుదలై మూడేళ్లు దాటిపోయింది. ఆ మూవీ మాయలో నుండి తెలుగు ప్రేక్షకులు ఇంకా బయటికి రాలేదు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి,శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం’ లవ్ స్టోరీ”. అక్కినేని నాగ చైతన్య ఈ చిత్రంలో కథానాయకుడు. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య వచ్చిన చిన్న టీజర్ అండ్ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
#LoveStory completes shoot and getting ready for its Theatrical release. pic.twitter.com/AFjJc5OuHm
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) November 18, 2020
గత సెప్టెంబర్ లో తిరిగి షూట్ ను ఆరంభించిన ఈ చిత్రం మొత్తానికి షూటింగ్ ను పూర్తి చేసేసుకుంది. ఏ ఈవిషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చెయ్యడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో శేఖర్ కమ్ముల తో పాటు హీరోయిన్ సాయి పల్లవి – డ్యాన్స్ మాస్టర్ శేఖర్ షూటింగ్ అయిపోయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు.కాగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావ్ కలిసి ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం సమకూరుస్తుండగా.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక షూటింగ్ కూడా కంప్లీట్ అవడంతో త్వరలోనే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.