ఇండస్ట్రీ టాక్ : “లవ్ టుడే” హీరోయిన్ కి బంపరాఫర్.. 

Ivana Latest Wallpapers

ఇప్పుడు తెలుగు సినిమా సహా తమిళ సినిమా నాట కూడా పలువురు యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తుంది. అలా తెలుగులో ప్రెజెంట్ శ్రీలీల, మీనాక్షి చౌదరి కృతి శెట్టి అని కొందరి హీరోయిన్స్ మంచి ఆఫర్స్ లో వెళ్తుండగా తమిళ నాట గత ఏడాది ఈ టైం లోనే వచ్చిన ఓ సినిమాతో సెన్సేషన్ గా మారిన యంగ్ హీరోయిన్ ఇవానా కూడా ఒకామె.

తాను నటించిన “లవ్ టుడే” చిత్రం ఆమెకి పెద్ద బ్రేక్ కాగా తమిళ్ తో పాటుగా ఈ చిత్రంలో కూడా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా ఓ ఆఫర్ అందుకున్న ఈ యంగ్ హీరోయిన్ ఇపుడు ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నట్టుగా కోలీవుడ్ సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ అయ్యిన దళపతి విజయ్ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో అయితే ఇవానా ఛాన్స్ కొట్టేసినట్టుగా అంటున్నారు. మరి ఆ సినిమాలో హీరోయిన్ గానా లేక ఏదన్నా ముఖ్య పాత్రో ఏమో కానీ తన కెరీర్ లో విజయ్ లాంటి స్టార్ తో సినిమా అంటే ఆమె కెరీర్ లో మంచి బూస్టప్ అని చెప్పొచ్చు.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లో తాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే విజయ్ నుంచి రీసెంట్ గా “లియో” అనే సినిమా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.