లియో డైరెక్టర్.. 100 కోట్ల ఆదాయం!

ఖైదీ సినిమాతో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్న యువ దర్శకుడు లోకేష్ కనగరాజుకు ఇప్పుడు డిమాండ్ గట్టిగానే పెరిగింది. మల్టివర్స్ కథలను తెరపైకి తీసుకువస్తూ ఉండడంతో స్టార్ హీరోలు కూడా అతనితో సినిమాలు చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేష్ ఆదాయం గత రెండు సినిమాలతోనే 100 కోట్లు దాటినట్లుగా తెలుస్తోంది.

అతను కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ లోనే విక్రమ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమాకు మొదట అతనికి 20 కోట్ల రేంజ్ లోనే పారితోషకం ఇవ్వాలని అనుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ సినిమా హై రేంజ్ లో సక్సెస్ అయితే లాభాల్లో షేర్ కూడా ఇవ్వాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాంతోనే ఆ సినిమా ద్వారా లోకేష్ కు 50 కోట్ల రేంజ్ లోనే ఆదాయం వచ్చింది.

ఇక ఇప్పుడు రాబోతున్న లియో విషయంలో మాత్రం అలాంటి అగ్రిమెంట్ కాకుండా ఒకేసారి పారితోషకంగా లోకేష్ తనకు రావాల్సింది తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 60 కోట్లకు పైగానే లియో సినిమా ద్వారా అతనికి ఆదాయం ముట్టినట్లు టాక్. అంటే ఈ రెండు సినిమాల ద్వారానే దాదాపు అతని రేంజ్ 110 కోట్లు దాటినట్లుగా సమాచారం.

ఒకవేళ లియో సినిమా గనక గ్రాండ్ సక్సెస్ అయితే మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాకు అతను 100 కోట్ల పారితోషకం తీసుకున్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దర్శకులకు ఉన్న డిమాండ్ హీరోలతో సమానంగానే ఉంది. ఇక ప్రస్తుతం లోకేష్ లియో సినిమాకు సంబంధించిన రిలీజ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.