ఈ ఏడాది తమిళ నాట వచ్చిన పలు భారీ హిట్ చిత్రాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజు మరియు హీరో విజయ్ ల కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లియో” కూడా ఒకటి. అప్పటికే వచ్చిన జైలర్ సినిమా ఒక మాసివ్ హిట్ అయితే ఈ సినిమా తర్వాత దానికి మించి షాకింగ్ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెలుతుంది.
ఐతే మొదటి వారం లోనే ఒక రికార్డు బ్రేకింగ్ తమిళ చిత్రంగా ఇది నిలవగా అసలు లియో వసూళ్లు నిజమేనా అనే టాక్ చాలా మందిలో స్టార్ట్ అయ్యింది. కాగా ఇదే కామెంట్ దర్శకుడు లోకేష్ దగ్గరకి వెళ్లగా తాను ఆసక్తికర సమాధానం అయితే అందించాడు. తాను నిజానికి అసలు ఈ కలెక్షన్స్ లెక్కలు అవీ పట్టించుకోను అని నాకు అవన్నీ అనవసరం.
నేను అయితే సినిమా రెస్పాన్స్ చూద్దామని థియేటర్స్ కి వెళ్లాను ఆడియెన్స్ అంతా ఎంతో ఎంజాయ్ చేశారు సో నేను హ్యాపీ ఈ కలెక్షన్స్ లెక్కలు అవీ నన్ను కాదు నిర్మాతలని అడగడండి అంటూ సమాధానం ఇచ్చేసాడు. దీనితో లోకేష్ ఆన్సర్ వైరల్ గా మారింది.
ఇక ఈ భారీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటించగా అర్జున్ సార్జా మరియు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ లు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం తమిళ నాట మినహా మిగతా భాషల్లో బాగానే రన్ అవుతుంది.