రజినీ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్..!

తమిళ నాట అలాగే సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో తలైవర సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. అయితే చాలా కాలం నుంచి తన రేంజ్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న చిరకాల కోరిక అయితే ఈ ఏడాదిలో జైలర్ సినిమాతో తీరిపోయింది.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ తెరకెక్కించగా ఈ సినిమా హిట్ తర్వాత రజినీకాంత్ చేస్తున్న నెక్స్ట్ సినిమాలపై మరింత హైప్ నెలకొంది. కాగా ఈ భారీ చిత్రాల్లో అయితే తమిళ ఆడియెన్స్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా బాగా ఎగ్జైట్ అవుతుంది మాత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేసే సినిమా కోసమే.

మరి ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో 171వ సినిమాగా అనౌన్స్ చేయగా దీనిపై భారీ హైప్ ఉంది. అయితే ఈ సినిమా విషయంలో తాను మొదటి నుంచి చాలా టెన్షన్ గా ఉన్నానని లోకేష్ చెప్తూ వచ్చాడు. అయితే తాను లేటెస్ట్ గా మాట్లాడుతూ తనకి ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చెయ్యడానికి నాలుగు నెలలు సమయం పడుతుంది.

అలాగే ఈ నాలుగు నెలల తర్వాత సినిమా నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేస్తానని తెలిపాడు. అంతే కాకుండా ఈ సినిమా ఒక కంప్లీట్ గా ఫుల్ లెంగ్త్ ఏక్షన్ డ్రామా అని తాను కూడా ఇప్పటివరకు చెయ్యని ఒక సరికొత్త ఏక్షన్ సబ్జెక్టు రజిని కోసం సిద్ధం చేస్తున్నానని తెలిపాడు. దీనితో ఈ క్రేజీ అప్డేట్స్ తో ఈ కాంబినేషన్ పై హైప్ మరో లెవెల్ కి వెళ్ళింది.