టీజర్ కోసం లైవ్ ఆర్కెస్ట్రా

మొదటి సారి ఒక మూవీ టీజర్ కోసం లైవ్ ఆర్కెస్ట్రాని అందించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఏకంగా 72 మంది బృందంతో రీరికార్డింగ్ కోసం లైఫ్ ఆర్కెస్ట్రాని వాడటం అంటే కచ్చితంగా అది రికార్డు అవుతుంది. అలాంటి సాహసమే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేశాడు. ప్రస్తుతం అతను అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

బాలకృష్ణ సినిమాలు అంటే కచ్చితంగా అతని యాక్షన్ ఎలివేషన్ కి తగ్గట్లుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పడాల్సిందే. అఖండ మూవీ సక్సెస్ లో సగం క్రెడిట్ తమన్ కి కూడా దక్కుతుంది. ఆ మూవీ రీరికార్డింగ్ నెక్స్ట్ లెవల్ లో ఇచ్చి ఆడియన్స్ కి గూస్ బాంబ్స్ తెప్పించాడు. అలాగే వీరసింహారెడ్డిలో కూడా బాలయ్య ఎలివేషన్ కి పెర్ఫెక్ట్ బీజీఎం ఇచ్చాడు.

ఇప్పడు భగవంత్ కేసరి మూవీ కోసం కూడా అంతకు మించి అవుట్ పుట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడంట. అందుకోసమే బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోయే టీజర్ కి ఏకంగా 72 మంది మ్యూజిషియన్స్ తో లైవ్ ఆర్ఆర్ కంపోజ్ చేయించడం జరిగిందంట. నిర్మాతలు కూడా బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఒకే చెప్పడంతో ఇది సాధ్యం అయ్యిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తమన్ టీజర్ కోసం ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవల్ లో ఉండబోతోంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. భగవంత్ కేసరి టీజర్ ని ఏకంగా 103 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్ కి లైవ్ ఆర్ఆర్ సౌండ్స్ తో ఫ్యాన్స్ కి గూస్ బాంబ్స్ రావడం పక్కా అనే మాట వినిపిస్తోంది. బాలయ్య అభిమానులు కూడా అలాగే కోరుకుంటున్నారు.

బాలకృష్ణ సినిమాలలో ఎలివేషన్స్, దానికి తగ్గ ఎమోషన్ క్యారీ చేసే బీజీఎం ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఈ రెండు పెర్ఫెక్ట్ గా సింక్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతారు. భగవంత్ కేసరి టీజర్ తో ఇప్పుడు ఈ సినిమా ఏ లెవల్ లో ఉండబోతోంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది.