‘లైగర్’ పెంట.! ఇంకా తుడుచుకోలేకపోతున్న పూరీ.!

డోంట్ కేర్.. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు..’ అని ప్రగల్భాలు పలికాడు ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాధ్. తీరని నష్టం మిగిల్చింది ‘లైగర్’. అందరికీ తెలిసిన ముచ్చటే ఇది.

ఈ విషయంలో నిర్మాతలు గగ్గోలు పెట్టగా, ఆ సమయంలో పూరీ చేసిన వ్యాఖ్యలే పైన చెప్పుకున్న మాటలు. అయితే, అంత సులువుగా ఆ పెంట వదిలేలా లేదు పూరీకి.

తెర వెనక చాలా చాలా రచ్చ జరిగిందింతవరకూ. ఇక తెర బయటికి వచ్చింది ఈ రచ్చ. నష్టపోయిన నిర్మాతలంతా బహిరంగంగా ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.

కాస్తయినా తగ్గి వుంటే బావుండేది పూరీ అని ఆయన సన్నిహితులు సలహా ఇచ్చారట. అయితే, పూరీ వినలేదట. తెగేదాకా లాగాడు. ఇప్పుడిది ఎంత దూరం వెళ్లుదో తెలియని పరిస్థితి.

పూరీ అయితే, బాగానే వున్నాడు. కానీ, ఈ ఎఫెక్ట్ అంతా విజయ్ దేవరకొండపై పడేలా వుంది. ఇదిలా వుంటే, త్వరలోనే విజయ్ దేవరకొండతో కొత్త సినిమా అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా వున్నాడు పూరీ జగన్నాధ్.