“లైగర్” ట్రైలర్ – పూరి, విజయ్ దేవరకొండల నుంచి ఊహలకు అందని విధ్వంసం.!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కి పాన్ ఇండియా స్థాయిలో మాంచి హైప్ కూడా ఉంది. కానీ ఇంకా ట్రైలర్ చూసే వరకు ఎవరూ ఒక అంచనాకి అయితే రావాలి అనుకోలేదు.

కానీ ఫైనల్ గా పాన్ ఇండియా వెర్షన్ లో ఈ ట్రైలర్ ని అనేక మంది ప్రముఖులు రిలీజ్ చెయ్యగా మన తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లు రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ చూసినట్టు అయితే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ లాంటి కాంబో కలిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ స్టాండర్డ్స్ ని సాలిడ్ గా చూపించారు.

ముందుగా నటి రమ్య కృష్ణ రోల్ తో అసలు లైగర్ అనే పదం ఎలా వచ్చింది విజయ్ దేవరకొండ రోల్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేసింది. ఇక అక్కడ నుంచి ప్రొసీడింగ్స్ లో విజయ్ దేవరకొండ ఫైట్స్ అయితే మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయని చెప్పాలి.

వీటిని మించి సర్ప్రైజింగ్ ఏంటంటే విజయ్ దేవరకొండ కి ఇందులో ఒక లోపం ఉండడం దానిని తాను బాగా చేయడం అదిరింది. ఇక హీరోయిన్ అనన్య పాండే తో ఏం చేయిచాలో పూరి సినిమాలో హీరోయిన్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ లెవెల్ లోనే మంచి హాట్ అంశాలు కూడా ఉన్నాయి.

ఇక ఫైనల్ గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కి సాలిడ్ ఎంట్రీ సెట్ చేసి స్టోరీతో బాగా సెట్ చేసినట్టు అనిపిస్తుంది. పైగా పంచ్ డైలాగ్ తో ట్రైలర్ మాత్రం ఊహించని రేంజ్ లోనే అనిపిస్తుంది. మరి ఈ ఆగస్ట్ లో వచ్చే ఈ సినిమా ఈ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాల్సిందే. 
LIGER TRAILER (Telugu) | Vijay Deverakonda | Puri Jagannadh | Ananya Panday | Karan Johar | 25th Aug