జీవితం ఎన్నో పాఠాలను నేర్పింది… ఐశ్వర్య రాజేష్ కన్నీటి కష్టాలు మామూలుగా లేవు?

సినిమా ఇండస్ట్రీలో తెరపై మనకు అందాలను ఆరబోస్తూ నవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా కనిపించే హీరోయిన్ల నిజ జీవితంలో కూడా ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి.ఆ కష్టాలన్నింటినీ పక్కనపెట్టి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం వీళ్ళు మొహంపై చిరునవ్వులు చిందిస్తూ కనపడుతుంటారు. అయితే ఒక్కసారిగా వారి గతం తెలిస్తే కన్నీలాగావు. ఇలా తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు నటి ఐశ్వర్య రాజేష్.

ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హీరో రాజేష్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటమే కాకుండా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

తనకు ఎనిమిది సంవత్సరాల వయసులోనే తన తండ్రి నీ కోల్పోవడంతో కష్టాలు మొదలయ్యాయని వెల్లడించారు.ఊహ తెలిసిన వయసులో తండ్రి కోల్పోవడం అనంతరం రోడ్డు ప్రమాదంలో అన్నయ్యలు దుర్మరణం చెందారు. ఇలా జీవితం తనకు ఎన్నో పాఠాలను నేర్పిందని,తాను సినిమాలలోకి రాకముందు అలాగే వచ్చిన తర్వాత కూడా ఎదురు దెబ్బలు తగిలాయని ఈ ఎదురుదెబ్బలతో తాను ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తెలిపారు. తాను ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకోకపోయినా తాను నటించిన సినిమాలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలని ఆశపడ్డానంటూ ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.