విజయ్ “లియో” కి అక్కడ ఇంట్రెస్టింగ్ రిలీజ్..!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా నుంచి పాన్ ఇండియా వైడ్ గా మాసివ్ రిలీజ్ అండ్ అంచనాలు ఉన్న పలు భారీ చిత్రాల్లో అయితే కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకడైన దళపతి విజయ్ హీరోగా నటించిన భారీ చిత్రం “లియో” కూడా ఒకటి, మరి ఈ సినిమాపై తమిళ్ సహా తెలుగులో కూడా భారీ హైప్ ఉంది.

అలానే ఇంట్రెస్టింగ్ హా ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా క్రేజీ డిమాండ్ నెలకొనడంతో అక్కడ టికెట్లు అయితే ఓ రేంజ్ లో అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ సినిమాని తమిళ హిట్ దర్శకుడు లోకేష్ కనగ రాజు తెరకెక్కించగా బాలీవుడ్ సహా తమిళ్ నుంచి కూడా పలువురు నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా విషయంలో విజయ్ ఫ్యాన్స్ కి అయితే ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు చిత్రంని ఓ చోట మాత్రం అసలు సెన్సార్ లేకుండా రిలీజ్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇది యూకే దేశంలో కన్ఫర్మ్ అయ్యింది. అక్కడ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థ అహింస ఎంటర్టైన్మెంట్స్ వారు దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై రెస్పెక్ట్ తో తాము లియో అన్ కట్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నామని ఓ పవర్ ఫుల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

దీనితో అక్కడ మాత్రం ఈ సినిమా ఎలాంటి సెన్సార్ మ్యూట్ లు లేకుండా ఏక్షన్ కూడా ఏమాత్రం తగ్గించకుండా రిలీజ్ చేస్తారని చెప్పాలి. మాకు మెయిన్ గా కావాల్సింది ఆడియెన్స్ రియాక్షన్ మాత్రమే అని అందుకే 12ఏ సర్టిఫికేట్ తో ఫ్రెండ్లీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇది మాత్రం యూకే విజయ్ ఫ్యాన్స్ కి ఓ పండుగ లాంటి వార్త అని చెప్పాలి.
https://x.com/ahimsafilms/status/1701855752669814840?s=20