లాభాలు ఇచ్చిన “లియో” సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్ 

ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఇంటెన్స్ ఏక్షన్ డ్రామా “లియో” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా రిలీజ్ అయితే వాటిని అందుకోవడంలో దగ్గరకి వచ్చి ఇది ఆగిపోయింది.

అయినా కూడా లియో విజయ్ కెరీర్ లో రికార్డు గ్రాసర్ గా నిలవగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసిన అన్ని చోట్లా లాభాలనే అందించింది. మరి అలా తెలుగులో కూడా ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించగా ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.

అయితే తాము తక్కువ పెట్టి కొన్నప్పటికీ ఈ సినిమాకి జస్ట్ వారంలోనే భారీ లాభాలు వచ్చేసాయి. అయినా కూడా నాగవంశీ ఈ సినిమాపై చేసిన లేటెస్ట్ కామెంట్స్ తో నెటిజన్స్ షాకయ్యారు. నిజానికి తనకి లియో సినిమా అంతగా ఏమి నచ్చలేదు అని చెప్పేసాడు నాగవంశీ. ఇదేంటి తానే తెలుగులో రిలీజ్ చేసాడు అలాంటిది తానే తన సినిమా నచ్చలేదు అని చెప్పడంతో నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

దీనితో ఈ నాగవంశీ ఎవరికీ అర్ధం కాడని అనుకుంటున్నారు. ఒక ఆడియెన్ గా అయితే తాను చెప్పిన దానిలో ఎలాంటి అబద్దం లేదు. ఎంత డిస్ట్రిబ్యూటర్ అయినప్పటికీ నచ్చనిదాన్ని నచ్చింది అని చెప్పాలని లేదు. దీనితో కొందరు నాగవంశీ ముక్కుసూటితనాన్ని పొగుడుతున్న వారూ లేకపోలేరు.