ఇప్పుడు ఒక్క తమిళ సినిమా నాట మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియా లోనే ఈ ఏడాదికి మోస్ట్ హైప్ తో వచ్చిన ఏకైక చిత్రమే “లియో”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి రెండు సెన్సేషనల్ హిట్ చిత్రాలు అనంతరం వచ్చిన ఈ సినిమా అసలు కాంబినేషన్ తోనే నెక్స్ట్ లెవెల్ హైప్ ని తెచ్చుకోగా..
ఈ సినిమా అసలు ఎల్ సి యూ లో ఉందా లేదా అనేది మరింత సస్పెన్స్ గా మారింది. దీనితో ఇలా రిలీజ్ వరకు కూడా ఓ రేంజ్ లో హైప్ ని కొల్లగొట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ అయితే తమిళ సినిమా నుంచి ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్ అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
లేటెస్ట్ గా వారు చెప్తున్నా దాని ప్రకారం లియో ఏకంగా 142 కోట్ల మేర వసూళ్లు అందుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఐతే మొత్తం ఇండియా వైడ్ గా అన్ని భాషలు కలిపి 76 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంటే ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే మరో 65 కోట్లకి పైగా అందుకుంది అట.
దీనితో విజయ్ కెరీర్ లోనే ఈ సినిమా ఒక సెన్సేషనల్ ఓపెనర్ గా నిలవడమే కాకుండా తమిళ సినిమా నాట కూడా ఒక షాకింగ్ అండ్ షేకింగ్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా లియో నిలిచింది అని అక్కడి సినీ ట్రాకర్స్ అంటున్నారు. మొత్తానికి అయితే లియో మాత్రం లాంగ్ లో చాలానే మాజికల్ ఫిగర్స్ అందుకునేలా ఉందనే చెప్పాలి.